ఈ నూనె జుట్టుకి పట్టిస్తే జుట్టు విపరీతంగా పెరగటమే కాకుండా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది

Hair Growth oil : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువైంది. చాలా చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య రావటంతో చాలా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది. మనం ప్రతి రోజు కూరల్లో వాడే కరివేపాకు జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి పనిచేస్తుంది.
hair fall tips in telugu
కరివేపాకును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకుంటూ జుట్టుకు కరివేపాకుతో తయారు చేసిన నూనెను వాడితే మంచి ప్రయోజనం కనబడుతుంది. 100 ml కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు ఆకులను వేసి బాగా మరిగించి వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా 15 రోజులు పాటు నిల్వ ఉంటుంది.
curry leaves
ఈ నూనెను ప్రతిరోజు తలకు రాసి ఐదు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. కరివేపాకులో ఉన్న ఆల్కలాయిడ్స్ తల బాగంలో ఉండే చర్మం పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది. కరివేపాకులో ఉండే పోషకాలు తలలో ఉండే బ్యాక్టీరియాను, ఫంగస్ ని తొలగించి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది.

అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టును కూడా తగ్గిస్తుంది. ఆక్సిడేషన్ ఒత్తిడి కారణంగా రక్షణ వ్యవస్థ జుట్టు కుదుళ్ల దగ్గర ఉండే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనో సైట్ దగ్గర ఉండే కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దీని కారణంగా తెల్ల జుట్టు వస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వలన తెల్లజుట్టు సమస్య తగ్గుతుంది.
Hair Care
కరివేపాకులో ఉండే బీటా కెరోటిన్ జుట్టు కుదుళ్ళ నుండి జుట్టు నల్లగా ఉండటానికి సహాయపడుతూ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. కరివేపాకును మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్టు ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకు బాగా పట్టించి పావుగంట తర్వాత కుంకుడుకాయతో తలస్నానం చేయవచ్చు. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య అలాగే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.