ఆపిల్ తో ఇలా చేస్తే అసలు మేకప్ జోలికి వెళ్లరు…ఇది నిజం

Apple Beauty Tips : ఆపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజుకొక ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదని అంటూ ఉంటారు. అయితే ఆపిల్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. మనలో చాలా మంది ఆపిల్ తింటారు. కానీ బ్యూటీ ప్రయోజనాల కోసం పెద్దగా ఎవరు ఉపయోగించరు.
Young Look In Telugu
ఇప్పుడు ఆ బ్యూటీ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆపిల్ ని ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఒక స్పూన్ ఆపిల్ పేస్ట్ లో అరస్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల‌, మ‌చ్చ‌లు తగ్గుతాయి. అలాగే ముఖం కొత్త కాంతివంతంగా మారుతుంది.
apple
ఆపిల్ ను వేడినీళ్ళలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.ఆ తర్వాత తొక్కను తొలగించి.పేస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్ పేస్ట్‌లో అరస్పూన్ గోధుమ‌పిండిని కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే చర్మంలో ఉన్న మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
Face Beauty Tips In telugu
ఈ రెమెడీ కోసం కూడా ఉడికించిన ఆపిల్ పేస్ట్ ఉపయోగించాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల ఆపిల్ పేస్ట్, ఒక స్పూన్ ఒట్స్ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు బాగా పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ ఆపిల్ ఫేస్ ప్యాక్‌ను వారంలో మూడు సార్లు వేస్తే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. నల్లని మచ్చలు,మొటిమలు అన్ని తొలగి పోతాయి. పొడి చర్మం వారికి కూడా మంచి ప్రయోజనంను అందించి తేమ ఉండేలా చేస్తుంది. ఆపిల్ ఆరోగ్యనికే కాదు అందానికి కూడా బాగా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.