ఉదయం 1 గ్లాస్ తాగితే అలసట,నీరసం,నిస్సత్తువ లేకుండా హుషారుగా ఉంటారు

Carrot, Beetroot and Pomegranate Juice : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం నుంచి పనులు చేసినప్పుడు మధ్యాహ్నం అయ్యేసరికి చాలా మందికి నీరసం,అలసట వంటివి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వారు ఇప్పుడు చెప్పే జ్యూస్ తీసుకుంటే నీరసం,అలసట తగ్గటమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు.

రోజంతా నీరసం, అలసట లేకుండా హుషారుగా పనులు చేసుకోవాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని ఉదయం సమయంలో తీసుకోవాలి. అలాంటి ఆహారం అంటే ఇప్పుడు ఉదయం సమయంలో తీసుకునే ఒక juice గురించి తెలుసుకుందాం. ఉదయం సమయంలో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
beetroot juice
రాత్రి సమయంలో ఐదు బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం బాదంపప్పు తొక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.అలాగే నాలుగు వాట్ నట్స్ ని కూడా నానబెట్టి తొక్క తీసి ఉంచుకోవాలి. ఒక క్యారెట్, ఒక బీట్రూట్ తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

వీటిని మిక్సీ జార్ లో వేసి ఆ తర్వాత ఒక కప్పు దానిమ్మ గింజలు, తొక్క తీసిన బాదంపప్పులు, వాల్ నట్స్, రెండు స్పూన్ల తేనె వేసి ఒక కప్పు నీటిని వేసి మెత్తగా మిక్సీ చేసుకుంటే జ్యూస్ రెడీ అయినట్టే. ఈ జ్యూస్ ని ప్రతి రోజు ఉదయం తాగితే రోజంతా శ‌రీరం మ‌రియు మెడ‌దు ఎన‌ర్జిటిక్‌గా ఉండ‌టానికి అవ‌స‌రం శ‌క్తి ల‌భిస్తుంది.
Immunity foods
అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు ఏమి రాకుండా కాపాడుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు అన్నీ తొలగిపోతాయి. రక్తహీనత సమస్య అనేది ఉండదు. కంటికి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా కంటి చూపు బాగుంటుంది. కాలేయంనకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.