కొత్తిమీర+నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా ?

Coriander leaves and Lemon Benefits : కొత్తిమీర మరియు నిమ్మకాయలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీర జీవక్రియరేటును పెంచుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

ఈ డిటాక్స్ డ్రింక్ శరీరాన్ని హైడ్రేటింగ్ మరియు రిఫ్రెష్‌గా ఉంచటమే అధిక బరువు మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది. శరీరాన్ని సహజంగా నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపుతుంది. ఈ డ్రింక్ ఎలా తయారుచేయాలో చూద్దాం.
lemon benefits
రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో కొన్ని కొత్తిమీర ఆకులను ,ఒక స్పూన్ నిమ్మరసం వేసి రాత్రంతా అలా వదిలేయలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి కొన్ని కొత్తిమీర ఆకులను వేసి 5 నిమిషాలు మరిగించి వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడూ ఒక స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఉదయం పరగడుపున తాగాలి.

ఈ డ్రింక్ కాలేయన్ని శుభ్రపరుస్తుంది. ఈ డ్రింక్ ని రోజు విడిచి రోజు 15 రోజుల పాటు తాగాలి. ఆ తర్వాత 15 రోజులు అయ్యాక మరల 15 రోజులు తాగాలి. ఈ డ్రింక్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ప్రస్తుతం సీజన్ మారింది కాబట్టి ఈ డ్రింక్ చాలా హెల్ప్ చేస్తుంది.
lemon benefits
నిమ్మరసంలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ ఉండుట వలన బరువు తగ్గించటానికి సహాయపడుతుంది. ఈ జ్యూస్‌ని తాగడం వల్ల పోషకాలను గ్రహించి, కాలేయాన్ని యాక్టివేట్ చేసి టాక్సిన్స్‌ను బయటకు పంపే శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. నిమ్మరసం రోజంతా శరీరంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.