Healthhealth tips in telugu

Anemia: రక్తహీనతతో బాధపడుతున్నారా? ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది

Rose petals helps to reduce anemia : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా మనలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చాలా మంది ఐరన్‌ లోపం వల్ల ఏర్పడే రక్తహీనతతోనే బాధపడుతున్నారు. శరీరానికి అవసరమైనంత ఐరన్‌ అందనప్పుడు తగినంత హిమోగ్లోబిన్‌ తయారు కాదు. హిమోగ్లోబిన్‌ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది, శరీరంలో ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది.

రక్తహీనత సమస్య కారణంగా తలనొప్పి,అలసట,నీరసం, పని మీద శ్రద్ద పెట్టకపోవటం,మైకం,అసౌకర్యంగా ఉండటం, బలహీనత,శ్వాస తీసు కోవటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనపడతాయి. ఈ లక్షణాలు కనపడగానే అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. అలాగే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

రక్తహీనత సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. అలా చేస్తే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. రక్తహీనత సమస్యను తగ్గించటానికి గులాబీ పువ్వులు చాలా బాగా సహాయపడతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కొంచెం వేడి అయ్యాక ఒక ఎర్ర గులాబీ పువ్వు రేకలను వేయాలి. తాజా పువ్వు లేదా ఎండిన పువ్వు అయినా వాడవచ్చు.

ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే గులాబీ,సొంపులో ఉన్న పోషకాలు నీటిలోకి చేరతాయి. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ప్రతి రోజు ఉదయం సమయంలో తాగితే 15 రోజుల్లో తేడా రావటాన్ని గమనించవచ్చు. ఈ టీ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రి సమయంలో తాగితే మంచి నిద్ర పడుతుంది. అలాగే సీజనల్ గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా ప్రతి రోజు ఒక గ్లాసు డ్రింక్ తాగి సమస్య నుండి బయట పడండి. సొంపు,గులాబీ రెండు కూడా సులువుగానే అందుబాటులో ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.