డయాబెటిస్ ఉన్నవారు బీరకాయ తింటే ఏమి అవుతుందో తెలుసా?

Beerakaya Health Benefits In Diabetes : డయాబెటిస్ ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ నియంత్రణలో ఆహారం అనేది కీలకమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు. అలాంటి ఆహారాలలో బీరకాయ ఒకటి.
Diabetes In Telugu
ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ ను ఉత్పత్తి చేస్తుంది. మనం తిన్న ఆహారం బీటా కణాల మధ్యలోకి వెళ్లకుండా రక్తంలో ఉండటం వలన చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మన శరీరానికి అవసరమైన ఇన్సులిన్ ఉత్పత్తి జరగకపోతే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటిస్ అనేది వస్తుంది.
Beerakaya benefits
బీరకాయ తినడం వలన ప్యాంక్రియాస్ ని ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటట్టు ఆక్టివేట్ చేస్తుంది.డయాబెటిస్ ఉన్నవారు వారంలో రెండు లేదా మూడుసార్లు బీరకాయ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బీరకాయలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. రెండింటి కాంబినేషన్ లో ఇన్సులిన్ ఉత్పత్తి బాగా పెరుగుతుంది.
beerakaya
బీరకాయలోని పోషకాలు రక్తంలో, యూరిన్ లో చక్కెర స్థాయిలను (Sugar levels) కలవకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తంలో ఇన్సులిన్ లెవల్స్ ను స్థిరంగా ఉంచి డయాబెటిస్ (Diabetes) ను తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే బీరకాయలో పెప్టైడ్స్‌, ఆల్కలాయిడ్స్ సమృద్దిగా ఉండుట వలన ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
Immunity foods
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే బీరకాయను కూరగా చేసినప్పుడు మనలో చాలా మంది పై తొక్క పూర్తిగా తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా బీరకాయ మీద ఉన్న ఈనెలను మాత్రం తీసి కూరగా వండుకోవాలి. అప్పుడే బీరకాయలో ఉండే పోషకాలు అన్నీ మన శరీరానికి అందుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.