డయాబెటిస్ ఉన్న వారు ఈ పండ్లతో జాగ్రత్తగా ఉండాలి….లేకపోతే…?
Diabetes Foods : డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే జీవితం మొత్తం అది మనతోనే ఉంటుంది. డయాబెటిస్ ఎప్పుడు కంట్రోల్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు పండ్లను తినటానికి చాలా భయపడతారు. పండ్లను తింటే ఎలా తినాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అరటిపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మలబద్దకం,రక్తహీనత సమస్యల నుండి బయటపడేస్తుంది. అరటిపండులో చక్కర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందువల్ల సగం అరటిపండు తింటే మంచిది. అరటిపండు మొత్తం తినకూడదు.
ఇక యాపిల్ విషయానికి వస్తే యాపిల్ జీర్ణ సమస్యలను తగ్గించటమే కాకుండా కొలస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు రోజుకి ఒక యాపిల్ మాత్రమే తినాలి.
బొప్పాయిని కూడా చాలా మితంగా తీసుకోవాలి. రోజు కాకుండా రెండు రోజులకు ఒకసారి తీసుకోవాలి.
సీతాఫలంలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు అసలు సీతాఫలం తినకూడదు.
దానిమ్మ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించే శక్తి ఉంది. కాబట్టి రోజుకి సగం దానిమ్మ కాయ గింజలను తినవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.