Healthhealth tips in telugu

Turmeric Side Effects: పసుపు ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

Turmeric Side Effects : ఈ మధ్య కాలంలో పసుపు మంచిదని వాడకం ఎక్కువ అయింది. అయితే సరైన మోతాదులో తీసుకుంటే ఏ సమస్యలు ఉండవు. అదే మోతాదు మించితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

పసుపులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కూడా మనలో చాలా మంది పసుపును వాడుతున్నారు. అయితే పసుపును ఎక్కువ మోతాదులో వాడకూడదు. అలాగే మార్కెట్ లో దొరికే పసుపు కన్నా ఇంటిలో పసుపుకొమ్ములను పొడి చేసుకొని వాడితే మంచిది.

పసుపును సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. అదే మోతాదుకు మించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫక్ట్స్ కలుగుతాయి. వాటి గురించి తెలుసుకుందాం. అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. పిత్తాశయం పనితీరు మందగించి పిత్తాశయంలో రాళ్ళూ ఏర్పడే అవకాశం ఉంది.

రక్తస్రావం సమస్యలు ఉన్నవారు పసుపును తీసుకుంటే ఆ సమస్య ఎక్కువ అవుతుంది. కాలేయం పనితీరు మందగించి పచ్చ కామెర్ల వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పసుపు ఎక్కువగా వాడటం వలన కొంత మందిలో చర్మంపై దద్దుర్లు, దురద వస్తాయి. గర్భధారణ సమయంలో కూడా పసుపుకి దూరంగా ఉంటేనే మంచిది.

ఎందుకంటే పిండంపై ప్రభావం పడుతుంది. శరీరంలో పసుపు మోతాదు ఎక్కువ అయితే రక్తంలో ఉండే తెలుపు, ఎరుపు రక్త కణాలకు ముప్పు ఏర్పడుతుంది. అవి నాశనం అవుతాయి. అంతేకాకుండా పసుపులోని కర్కుమిన్ అనే పదార్థం రక్తాన్ని పలుచగా చేస్తుంది. పసుపును ఎక్కువగా తీసుకోవటం వలన రక్తం బాగా పలుచగా మారుతుంది.

చిన్న గాయమైనా కూడా అధికంగా రక్తస్రావం అవుతుంది.ఇంకా పీరియడ్స్ సమయంలో మహిళలు అధిక రక్తస్రావం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడుతాయి. దాంతో డయేరియా మరియు మలబద్దకం వంటి సమస్యలకు దారితీస్తుంది. రోజులో 2 గ్రాములకు మించి పసుపు తీసుకోకూడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.