చిటికెడు పసుపు ఎంత మాయ చేస్తుందో చూడండి…అసలు నమ్మలేరు

Turmeric Face Packs : ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో అందాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాల్ అని చెప్పవచ్చు. దాంతో మార్కెట్లో దొరికే క్రీమ్స్ కొనేసి వాడేస్తూ ఉంటారు. ఒక్కోసారి వాటి కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా కేవలం 10 నిమిషాల సమయాన్ని కేటాయిస్తే కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది. మనకి ఇంటిలో ఉండే పసుపు ను ఉపయోగించి కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
weight loss tips in telugu
ఒక స్పూన్ పసుపులో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటఅయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మొటిమలు, బ్లాక్ హెడ్స్ అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కా చేయటం చాలా సులువు.
Young Look In Telugu
ముఖం నిర్జీవంగా మారితే ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పాలమీగడలో పసుపు కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే కాంతివంతంగా మెరిసిపోతుంది.
Milk benefits in telugu
రెండు టీ స్పూన్ల పాలలో అర టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ముంచి ఆ దూదితో ముఖంపై రాస్తూ ఉండాలి. ఇలా ఐదు నిమిషాలపాటు చేస్తూ ఉంటే చర్మంపై ఉన్న జిడ్డు, మురికి అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గంధం, పసుపు, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది. ఈ చిట్కాలు అన్నీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.