వెదురు బియ్యాన్ని ఎప్పుడైనా చూసారా…ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Bamboo Rice Benefits : వెదురు బియ్యంతో తయారు చేసిన జావను ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే కీళ్లనొప్పులు నడుంనొప్పి అన్ని తగ్గిపోతాయి. వాపులు ఏమైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. ఈ వాన కాలంలో వచ్చే దగ్గు జలుబు కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దగ్గు, జలుబుగా ఉన్నప్పుడు వెదురు బియ్యాన్ని పొడిగా చేసి దానిలో తేనె కలిపి తీసుకోవాలి.
Diabetes In Telugu
డయాబెటిస్ ఉన్నవారు రోజు వారి ఆహారంలో వెదురు బియ్యం తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అయితే చాలామందికి వెదురు బియ్యం అంటే తెలియదు. వెదురు కర్ర ముదిరిన తర్వాత వాటికి వచ్చే గింజలనుండి ఈ బియ్యాన్ని సేకరిస్తారు. ఇవి చూడటానికి బార్లీ గింజల మాదిరిగా ఉంటాయి.

కొంచెం వగరు రుచి కలిగి ఉంటాయి. వెదురు బియ్యం లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఎక్కువగానూ కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. వెదురు బియ్యాన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి రోజుకి 15 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది. విటమిన్ బీ6 సమృద్ధిగా ఉంటుంది. పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
డయాబెటిక్, బీపీని నియంత్రించే గుణాలు ఉన్నాయి. వరి బియ్యం, గోధుమ కంటే ప్రొటీన్లు, పీచు ఎక్కువగా ఉంటుంది. సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.
veduru biyyam
పిత్త, కఫ దోషాలు తొలగిపోతాయి. శరీరంలోని ట్యాక్సీన్లు బయటకు తొలగిపోతాయి. చనిపోతున్న వెదురు రెమ్మ నుంచి ఈ బియ్యాన్ని తీస్తారు. ఇందువల్ల ఈ బియ్యం చాలా ప్రత్యేకమైనవి. గిరిజనులు నివసించే కొండ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.