వంటింట్లో 4 వస్తువులు…వారంలో 1 సారి…ముఖం మీద మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది

Winter Face Pack In Telugu : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ముఖం మీద మచ్చలు లేకుండా అందంగా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటున్నారు. అలా కోరుకోవటం కూడా సహజమే. అయితే దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ఈ రెమిడీని చేసుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక vitamin e capsule లోని ఆయిల్, అరస్పూన్ రోజ్ వాటర్ పోసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
kalabanda benefits in telugu
ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. కాఫీలో ఉండే కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహకరిస్తుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా స్మూత్ గా మంచి గ్లో తో ఉంటుంది.

కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నందున చర్మ సమస్యలను సహజంగా నయం చేయడంలో సహాయపడుతుంది. చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. రోజ్ వాటర్ మంచి స్కిన్ టోనరగా పనిచేస్తుంది.

ముఖం మీద పేరుకుపోయిన మురికీ, దుమ్ము,ధూళి,నూనె, జిడ్డు లాంటి వాటిని కూడా రోజ్ వాటర్ తొలగిస్తుంది. విటమిన్ E ఆయిల్ చర్మం ముడతలు పడకుండా చేయడంలో, డార్క్ సర్కిల్స్ తొలగించడంలో, చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడంలో సహాయపడుతుంది. పొడి చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.