1 గ్లాస్ ఎంతటి వేలాడే పొట్ట,నడుము,తొడల చుట్టూ ఉన్న కొవ్వును అయినా మైనంలా కరిగిస్తుంది

weight Loss Tips In Telugu : ఈ మధ్య కాలంలో అధిక బరువు మరియు శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించు కోవటానికి మన వంటింటిలో ఉండే కొన్ని పదార్ధాలను ఉపయోగిస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. కాస్త ఓపికగా పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గవచ్చు.
weight loss tips in telugu
మనం వంటింటిలో ప్రతి రోజు ఉపయోగించే పసుపు బరువు తగ్గించటానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయ పడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ కొవ్వు కణజాల పెరుగుదలను అడ్డుకుంటుంది. ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా పాలల్లో రెండు చిటికెల పసుపు పొడి కలిపి తాగాలి.
Triphala Churnam Benefits In telugu
త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన కొవ్వును కరిగించే ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది. అలాగే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారెలా చేస్తుంది. ప్రేగు కదలికలను కూడా ప్రేరేపిస్తుంది. గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు చిటికెల పొడి కలిపి తాగాలి.
Weight Loss Drink In Telugu Dalchina Chekka
దాల్చిన చెక్క బరువును తగ్గించటానికి సహాయపడుతుంది. ఇది జీవక్రియ రేటును పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయ పడుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు చిటికెల దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలిపి తాగాలి. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది.
Weight Loss tips in telugu
ఇప్పుడు చెప్పిన మూడింటిలో మీకు లభ్యం అయిన దాన్ని బట్టి ఒక రకం పొడిని వాడవచ్చు. ఇలా తీసుకుంటూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గాలి. కాస్త ఓపిక సమయాన్ని కేటాయిస్తే మన వంటింటిలో ఉండే వస్తువులతో ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.