3 రోజులు వాడితే చాలు ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి

Yellow Teeth Home Remedies : పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తూ ఉంటేనే బాగుంటుంది. చాలా. మంది పళ్ళు గార పట్టి పసుపు రంగులో మారి ఉంటాయి. అంతేకాకుండా మరికొంతమందికి చిగుళ్ల వాపు వస్తుంది. అలాగే నోటి దుర్వాసన కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్లు చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. .
Biryani leaves health benefits In Telugu
మన ఇంటిలో సహజసిద్ధంగా ఉండే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చుతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఈ రెమిడి కోసం బిర్యానీ ఆకు.ను ఉపయోగిస్తున్నాం. బిర్యానీ ఆకు గార పట్టిన పళ్ళను తెల్లగా మారుస్తుంది. బిర్యానీ ఆకులో ఉన్న పోషకాలు చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన, పుచ్చు పళ్ళను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బిర్యానీ ఆకులను మిక్సీలో వేసి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బిర్యానీ ఆకుల పొడి, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎక్కువ .మోతాదులో చేసుకుని ఫ్రిజ్ లో పెడితే వారం రోజులు వరకు నిల్వ ఉంటుంది.

ఈ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే పంటి మీద గార, పసుపు రంగు తొలగి పళ్ళు ముత్యాల మెరుస్తూ ఉంటాయి. ఈ రెమిడిలో ఉపయోగించిన ఉప్పు చిగుళ్ళు స్ట్రాంగ్ గా ఉండటానికి మరియు పంటి మీద గారను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ రెమిడి ఫాలో అవుతూ ఇప్పుడు చెప్పే మౌత్ ఫ్రెషనర్ తో నోటిని శుభ్రం చేసుకుంటే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది. మౌత్ ఫ్రెషనర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
White teeth tips
ఒక బౌల్ లో నాలుగు బిర్యానీ ఆకులు, నాలుగు లవంగాలు, సగం నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని పోసి మూత పెట్టి ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ నీటిని గోరువెచ్చగా చేసుకొని ఒక చిన్న గ్లాసులో పోసుకొని నోటిని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం వలన నోటి దుర్వాసన తగ్గడమే కాకుండా దంతాలు దృఢంగా మారతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.