కెమికల్ షాంపూ వాడకుండా కరివేపాకుతో ఇంట్లోనే షాంపూ తయారి…జుట్టు అసలు రాలదు

Hair Fall Shampoo : ఈ మధ్య కాలంలో జుట్టుకి ఏ సమస్య వచ్చిన మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలా వాడటం వలన వాటిలో ఉండే కెమికల్స్ కారణంగా కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అలా కాకుండా మన ఇంటిలోనే సహజసిద్దమైన పదార్ధాలతో షాంపూ తయారుచేసుకొని వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి.

ఇంటిలో కలబంద మొక్క ఉంటే దాని నుండి జెల్ తీయాలి. అరకప్పు కలబంద జెల్ రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్ లో కలబంద జెల్, శుభ్రంగా కడిగిన గుప్పెడు కరివేపాకు, రెండు మందార పువ్వుల రేకలు, నాలుగు మందార ఆకులను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి.ఆ తర్వాత కొంచెం నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
curry leaves
ఈ పేస్ట్ నుంచి పలుచని క్లాత్ సాయంతో రసంను వడకట్టాలి. వడకట్టిన మిశ్రమంను తల రుద్దుకోవటానికి ఉపయోగించే కుంకుడుకాయ రసంలో కలిపి తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య ,చుండ్రు సమస్య వంటివి అన్ని తొలగిపోతాయి. ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
Hair fall Tips in telugu
ఈ మధ్య కాలంలో చాలా మంది షాంపూ వాడుతున్నారు. అలా కాకుండా కుంకుడుకాయలను వాడితే మంచిది. కలబంద, కరివేపాకు, మందార పువ్వు,ఉల్లిపాయ ఇవన్నీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉంటాయి. వీటిలో ఉన్న పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది.

ఎర్ర రేక మందార పువ్వులను వాడాలి. ఇంటిలో కలబంద మొక్క లేకపోతే మార్కెట్ లో దొరికే జెల్ వాడవచ్చు. జుట్టుకి సంబందించిన సమస్యలు రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.