పాలల్లో ఈ పొడి కలిపి తాగితే క్షణాల్లో నిద్రపోతారు…నిద్రలేమి సమస్య అనేది జీవితంలో ఉండదు

Good sleep Foods : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి అనేక రకాల కారణాలతో నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. నిద్రలేమి సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఇప్పుడు చెప్పే చిట్కాను పాటిస్తే నిద్ర బాగా పడుతుంది. .
Ashwagandha
నిద్ర బాగా పట్టాలంటే అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. అశ్వగంధలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అశ్వగంధను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఒత్తిడిని దూరం చేసి మంచి నిద్ర పట్టడానికి అశ్వగంధ చాలా బాగా సహాయపడుతుంది. . అశ్వగంధలో ఉండే త్రి ఇథైల్ గ్లైకాల్ అనేది నిద్ర పట్టడానికి చాలా బాగా సహాయపడుతుంది.
sleeping problems in telugu
రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో పావు స్పూన్ పొడిలో సగం అశ్వగంధ పొడి కలిపి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే అశ్వగంధను తీసుకోవటం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
how-to-use-Ashwagandha
ఈ పొడిని తీసుకోవడం వలన డిప్రెషన్ లో ఉన్న వారికి చాలా మంచి ప్రయోజనాలు అందిస్తుంది. డిప్రెషన్ లో ఉన్నవారికి ఉండే నెగటివ్ ఆలోచనలు తగ్గించి పాజిటివ్ ఆలోచనలు పెరిగేలా చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. కార్టిసాల్ అనేది ఒత్తిడిని పెంచే హార్మోను ఎక్కువగా విడుదల అవ్వకుండా అశ్వగంధ సహాయపడుతుంది.
Ashwagandha-powder
టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి వంటి బిజీ జీవనశైలి ఉన్నవారు ఈ పొడిని వాడితే మంచి ఉపశమనం కలిగించటమే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అశ్వగంధ పొడి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ పొడిని వాడి నిద్రలేమి సమస్య నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.