పార్టీకి వెళ్లే 5 నిమిషాల ముందు ఇలా చేస్తే…తెల్లని మెరిసే ముఖం మీ సొంతం

Instant Skin Whitening Remedy : ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడరు. అయితే ఇప్పుడు మనం ముఖం తెల్లగా కాంతివంతంగా మారటానికి చాలా తక్కువ ఖర్చుతో ఒక మంచి చిట్కాను తెలుసుకుందాం. చాలా సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫంక్షన్స్ కి వెళ్ళటానికి ముందు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Face Beauty Tips In telugu
సాదరణంగా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలని అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలు ఖర్చు పెట్టి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటాం. ఆలా చేయించుకుంటే ముఖం అందంగా మెరిసిపోతూ ఉంటుందని భావిస్తాం. అయితే ఎటువంటి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా,ప్రకాశవంతంగా మారుతుంది.

ఒక బౌల్ లో కొంచెం Fair & Lovely Cream వేసి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక vitamin E capsule లోని ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక ముఖాన్ని తడి కాటన్ తో తుడవాలి.

5 నిముషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. Fair & Lovely Cream లో నిమ్మకాయ కలపటం వలన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి ముఖం మీద ఉన్న దుమ్ము,ధూళి వంటి వాటిని తొలగించి తెల్లగా,ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని అందంగా మెరిసేలా చేసుకోవచ్చు.
Wrinkles remove Tips In Telugu
Vitamin E Oil యాంటీ ఏజింగ్ మరియు స్కిన్ కండిషనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ముఖం మీద ముడతలు,నల్లని మచ్చలను తొలగిస్తుంది. మొటిమలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన ముఖం మీద మురికిని తొలగిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.