వీటిని తీసుకుంటే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం క్లీన్ అయ్యి రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉండదు

cholesterol Reduced Fruits : రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అధిక బరువు సమస్యకు కారణం అవ్వటమే కాకుండా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్,చెడు కొలెస్ట్రాల్ అనే రెండు రకాలు ఉంటాయి. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా…చెడు కొలెస్ట్రాల్ తగ్గేలా చూసుకోవాలి.

ఫైబర్ సమృద్దిగా ఉండే పండ్లను ఆహారంలో బాగంగా చేసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. కరిగే ఫైబర్ సమృద్దిగా ఉండే పండ్లు గుండెపోటు, ధమని అడ్డుపడటం మరియు ఇతర గుండె సమస్యల నుండి రక్షిస్తాయి. నిపుణులు కొలెస్ట్రాల్ నియంత్రణకు కొన్ని పండ్లను సూచిస్తున్నారు. వాటిని తీసుకుంటే మంచి ఫలితం వస్తుంది.

ఆపిల్
కొలెస్ట్రాల్‌ను తగ్గించే విషయంలో యాపిల్‌ను అత్యుత్తమ పండ్లలో ఒకటిగా చెప్పవచ్చు. యాపిల్స్‌లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదనంగా, ఆపిల్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి రోజుకి ఒక ఆపిల్ తింటే మంచిది.

అరటి పండు
అరటిపండులో ఉండే ఫైబర్ మరియు పొటాషియం కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది. అరటి పండులో ముఖ్యంగా కరిగే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచటానికి సహాయపడుతుంది. రోజుకి ఒక అరటిపండు తింటే సరిపోతుంది. ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది.
pine apple benefits in telugu
పైనాపిల్
పైనాపిల్ లో విటమిన్లు, ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ ధమనులలోని కొలెస్ట్రాల్ నిక్షేపాలను విచ్ఛిన్నం చేస్తుంది, ఇది ఆరోగ్యకరమైన రక్త ప్రవాహానికి తోడ్పడుతుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొంతమంది పైనాపిల్ తినటానికి ఆసక్తి చూపరు. కానీ పైనాపిల్ తింటే కొలెస్ట్రాల్ సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.