ఉల్లిపాయను 3 రోజులు ఇలా వాడితే తల నుండి ఒక్క వెంట్రుక రాలదు…ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Onion Hair Growth Tips In telugu : ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్య ఎక్కువై జుట్టు బాగా సన్నగా మారిపోతుంది. చుండ్రు సమస్య, జుట్టు చివర్లు చిట్లటం, తెల్ల జుట్టు సమస్య ఇలా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య నుంచి .బయట పడాలంటే ఇప్పుడు చెప్పే రెమిడీ చాలా బాగా సహాయపడుతుంది.

ఒక ఉల్లిపాయను తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, గుప్పుడు కరివేపాకు, ఒక స్పూన్ కలోంజీ సీడ్స్, నాలుగు చుక్కలు ట్రీ టీ ఆయిల్, మూడు స్పూన్ల అలోవెరా జెల్ వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
curry leaves
ఈ విధంగా వారంలో రెండు లేదా మూడుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.ఉల్లిపాయలో ఉండే కెరోటిన్ జుట్టు రాలకుండా చుండ్రు లేకుండా ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కరివేపాకు దెబ్బతిన్న కుదుళ్ళను రిపేర్ చేసి జుట్టు స్ట్రాంగ్ గా ఎదగడానికి సహాయపడుతుంది. కలోంజి విత్తనాలు జుట్టు ఎదుగుదలకు సహాయపడటమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడుతుంది.

ఇక టీ ట్రీ ఆయిల్ చుండ్రు సమస్య, తలలో దురద వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. కలబంద అంటే అలోవెరా జెల్ జుట్టు రాలకుండా చుండ్రు లేకుండా జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యల నుండి బయట పడవచ్చు.
kalabanda beauty
ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి. ట్రీ టీ ఆయిల్ అందుబాటులో లేకపోతే Vitamin E ఆయిల్ వాడవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.