Healthhealth tips in telugu

Thyroid Foods:వీటిని ఇలా తీసుకుంటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య కంట్రోల్‌…

Thyroid Foods : ఈ మధ్య కాలంలో జీవనశైలిలో వచ్చిన మార్పులు, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం వంటి అనేక కారణాలతో థైరాయిడ్ సమస్య అనేది వస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ మంచి ఆహారం తీసుకుంటే థైరాయిడ్ సమస్య కంట్రోల్ లో ఉంటుంది.

థైరాయిడ్ హార్మోన్ సవ్యంగా విడుదల అయినప్పుడే శరీరంలో ప్రతి కణం సరిగ్గా పనిచేసి జీవక్రియ పనితీరు బాగుంటుంది. థైరాయిడ్ హార్మోన్ సరిగా విడుదల కాకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. పురుషుల కంటే స్త్రీలలో ఈ థైరాయిడ్ సమస్య పది రెట్లు ఎక్కువగా ఉంది.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు బరువు విపరీతంగా పెరిగిపోతూ ఉంటారు. నీరసంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి ఏకాగ్రత తగ్గుతుంది. సంతానలేమి సమస్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి.

శరీరంలో సెలీనియం., జింక్, ఐరన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి మరియు T3, T4 థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH) సంతులనం కోసం జింక్ అవసరం అవుతుంది. గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, మాంసం వంటి జింక్ సమృద్దిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

సెలీనియం థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి అవసరమైన ఖనిజం. థైరాయిడ్‌లో అధిక మొత్తంలో సెలీనియం ఉంటుంది. సెలీనియం లోపం కారణంగా థైరాయిడ్ సమస్య వస్తుంది. సెలీనియం సమృద్దిగా ఉండే బ్రెజిల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, జీడిపప్పు వంటి వాటిని ఆహారంలో బాగంగా చేసుకోవాలి.

శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు ఆ ప్రభావం హిమోగ్లోబిన్ ఉత్పత్తి మీద పడుతుంది. దాంతో శరీరంలోని వివిధ హార్మోన్ల స్థాయి పెరగడం, తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా థైరాయిడ్ హార్మోన్ T4ని T3గా మార్చడానికి థైరాయిడ్‌కు ఐరన్‌ అవసరం. ఐరన్ సమృద్దిగా ఉండే ఆకుపచ్చ కూరగాయలు, లివర్‌, అంజీర్‌, ఖర్జూరం వంటి వాటిని ఆహారంలో బాగంగా చేసుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.