పరగడుపున 2 ఖర్జూరాలు తింటే…ముఖ్యంగా ఈ సీజన్ లో…అసలు నమ్మలేరు

Dates Benefits in telugu :ఖర్జూరం అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు ఇష్టంగా తింటారు.ఖర్జూరం లో కాల్షియమ్,ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు జింక్ వంటి పోషకాలు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. నానబెట్టిన ఖర్జూరంలో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రెగ్యులర్ గా ఖర్జూరం తింటూ ఉంటే జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.
Health Benefits of Dates
ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తంలో హెమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రోజుకి రెండు ఖర్జూరాలను తినటం వలన శరీరానికి అవసరమైన ఐరన్ అందుతుంది. ఖర్జూరంలో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది.పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలకు మేలుచేస్తాయి. కడుపు మంటను కూడా తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఖర్జూరాలు ముందుంటాయి.
saraswati Plant
పొటాషియం శాతం ఎక్కువ ఉండి సోడియం చాలా తక్కువగా ఉండడం వల్ల ఖర్జూరం తింటే నరాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. వీటిల్లో జ్ఞాపకశక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన రోజు రెండు ఖర్జూరాలను తింటే వృద్ధాప్యంలో మతిమరుపు (అల్జీమర్స్) వ్యాధి బారిన పడుకుండా కాపాడుకోవచ్చు.ఖర్జూరంలో ఉండే మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. కీళ్ల నొప్పుల సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది.
gas troble home remedies
ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం. అలాగే శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. చాలా తేలికగా జీర్ణం అయ్యి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా వేసవిలో ముసలి వారికి ఖర్జురం పండ్లను తినిపిస్తే నీరసం,అలసట వంటివి రాకుండా ఉంటాయి. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. దీనిని తరచుగా తింటూ ఉంటే పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చెందుతుంది.
hair fall tips in telugu
ఖర్జూరంను ప్రతి రోజు తినటం వలన జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరగటమే కాకుండా మృదువుగా మారుతుంది. ప్రొటీన్, కాల్షియం, ఫైబర్, మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఎక్కువగా వాతావరణంలో తేమ కారణంగా జలుబు, దగ్గు వంటివి వస్తుంటాయి. ఒక్కోసారి ఎన్ని యాంటీ బ్యాక్టీరియల్ టాబ్లెట్స్ వాడినా దగ్గు,జలుబు వంటివి తగ్గవు. అప్పుడు ఖర్జూరంను నాలుగు రోజుల పాటు తింటే దగ్గు,జలుబు వంటివి తగ్గుతాయి.

సాధారణంగా గర్భిణీ స్త్రీలు ఖర్జూరాలు తినవచ్చా లేదా అని అపోహ ఉంటుంది. కానీ ఖర్జూరంలో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. వీటిల్లో సహజమైన షుగర్ ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు తక్షణ శక్తి అందుతుంది. కాబట్టి గర్భిణీలు ఖర్జూరం ను ఎటువంటి అనుమానం లేకుండా తినవచ్చు. విట‌మిన్ బి5 ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మానికి మేలు జ‌రుగుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల చ‌ర్మానికి క‌లిగే న‌ష్టం త‌గ్గుతుంది. వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.