మెంతులతో ఈ 2 కలిపి జుట్టుకి పట్టిస్తే నల్లగా,ఒత్తుగా 2 రెట్లు వేగంగా పెరుగుతుంది
Fenugreek seeds Hair fall Tips : ప్రస్తుత కాలంలో అందరికీ జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంది. మనం తీసుకునే ఆహారం, మన జీవన విధానంలో మార్పులు, వాతావరణ పరిస్థితులు, కాలుష్యం వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.
రాత్రి సమయంలో ఒక బౌల్ లో రెండు స్పూన్ల మెంతులను వేసి నీటిని పోసి నానబెట్టాలి. రెండు మందార పువ్వులను తీసుకొని రేకలుగా విడతీయాలి. ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మెంతులు,మందార రేకలు, రెండు స్పూన్ల కలబంద జెల్ వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి.
అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తగ్గుతాయి. మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. మెంతులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన జుట్టు రాలడం, చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఎర్ర మందార పువ్వులను ఉపయోగించాలి. జుట్టును ఆరోగ్యంగా మరియు కండిషన్‌గా ఉంచుతుంది, జుట్టును ఒత్తుగా మరియు వాల్యూమైజ్ చేస్తుంది, చుండ్రుకు చికిత్స చేస్తుంది, చివరలు చిట్లకుండ కాపాడటమే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఫ్లేవనాయిడ్లు, అమైనో ఆమ్లాలు మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన తల మీద చర్మంకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.
కలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు ఉండుట వలన తల మీద మృత చర్మ కణాలను రిపేర్ చేస్తాయి. ఇది ఒక గొప్ప కండీషనర్‌గా కూడా పని చేస్తుంది మరియు జుట్టును మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, తలపై దురదను నివారిస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.