పెసలుతో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు…ఇది నిజం

Mung Beans Benefits in telugu :మనం కందిపప్పు,శనగపప్పు మాదిరిగానే పెసలు, పెసరపప్పులను మనం వంటల్లో వాడుతూ ఉంటాం. పెసలు శరీర అవయవాలకు మంచి పుష్టిని ఇవ్వటమే కాకుండా బలాన్ని ఇస్తుంది. నరాల బలహీనత లేకుండా రక్తహీనత లేకుండా చేయడంలో పెసలు చాలా బాగా సహాయపడుతాయి.

కడుపులో మంటగా ఉన్నప్పుడు పెసరపప్పును బాగా ఉడికించి పై తేటను తీసి పంచదార వేసుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలానే ఎక్కువగా తాగకూడదు. ఒక గ్లాసు మించి తీసుకోకూడదు. పెసరపప్పుతో కట్టు చేసుకొని తీసుకుంటే జీర్ణశక్తిని పెంచి ఆకలిని పుట్టిస్తుంది. .
moong dal
జ్వరం వచ్చినప్పుడు కూడా ఈ కట్టును తీసుకోవచ్చు. కండరాలు నొప్పులు తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. శరీరానికి బలాన్ని పుష్టిని కలిగించడమే కాకుండా వాత వ్యాధులను తగ్గిస్తుంది. పేగు సమస్యలను తగ్గించడానికి, కళ్ళు మంటలతో బాధపడేవారికి పెసర పులగం తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. .

పెసరపప్పు ఒక కేజీ, బియ్యం నాలుగు కేజీలు తీసుకుని బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. దీనితో అన్నం వండుకుంటే పెసర పులగం అని అంటారు. ఈ పెసర పులగంలో అల్లం మిరియాలు వంటివి కూడా వేసుకోవచ్చు. బియ్యం పెసరపప్పు కలిపి జావ చేసుకొని కూడా తాగవచ్చు. కాబట్టి మీరు కూడా పెసలులో ఉన్న ప్రయోజనాలు పొందాలంటే తప్పనిసరిగా తీసుకోండి.

రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ ఉన్నవారిలో కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలానే ప్రతిరోజు తీసుకోకూడదు. వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.