కుంకుడు కాయలతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది

Kunkudukayalu Hair Fall Tips : ఎవరన్నా అందంగా ఉన్నారు అంటే దానికి కారణం ముఖ్యంగా జుట్టు. జుట్టు లేకపోతే ఎటువంటి వాళ్లైనా సరే అందంగా కనపడరు. అటువంటి జుట్టు విషయంలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం వాడే షాంపూ, రకరకాల కండిషనర్లు అన్నీ కూడా రసాయనాలతో చేయబడినవే.అసలు మనకి జుట్టు ఊడిపోయే సమస్య అక్కడినుంచీ మొదలు అవుతోంది.
hair fall tips in telugu
ఎంతో ధృడంగా ఉండే జుట్టుని మన చేతులారా అనేకరకాల షాంపూలు వాడి పోగొట్టుకున్తున్నాం. పూర్వం ఇటువంటి షాంపూలు లేనప్పుడు మనం కుంకుడు కాయలు వాడే వాళ్ళం. వాటివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. కుంకుడుకాయలు ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు దాగున్నాయి.
Kunkudu kaya
ఇది ప్రకృతి సహజసిద్ధంగా దొరికే షాంపూ. ఒక బౌల్ లో రెండు స్పూన్స్ కుంకుడుకాయ పొడి, రెండు స్పూన్ల ఉసిరికాయ పొడి, రెండు స్పూన్స్ తేనే వేసి అన్నీ ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి పట్టేలా చేసి ఒక అరగంట ఉంచాలి. ఇలా చేసిన తరువాత తలస్నానం చేయాలి.
usiri benefits in telugu
ఇలా తలస్నానం చేయడం వల్ల జుట్టు ఊడే సమస్య తీరుతుంది.తరువాత సాంబ్రాణి పొగతో ఆరేలా చేయాలి అంతేకానీ తుండుతో బలంగా తుడవకూడదు. అలాగే సున్నితంగా ఉండే తుండుతోనే తలని మెల్లగా తుడవాలి. కుంకుడు కాయలను ఉపయోగించి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు.
Hair Care
పూర్వ కాలంలో కుంకుడుకాయలను చాలా ఎక్కువగా వాడేవారు. ఇప్పటి తరం వారికి కుంకుడు కాయలు అంటే తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా షాంపూలను ఉపయోగించటం అలవాటు అయ్యిపోయింది. కుంకుడు కాయాలతో తలస్నానం చేస్తే జుట్టుకి అవసరమైన పోషణ కూడా అందుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.