ద్రాక్షలో ఉన్న ఆరోగ్య లాభాల గురించి మీకు తెలుసా…ముఖ్యంగా ఈ సీజన్ లో…

Grapes health benefits : ద్రాక్ష పండు గురించి తెలియని వారు ఉండరు. పళ్ళల్లో కొన్ని రకాలను కొంత మంది ఇష్ట పడకపోవచ్చు. కానీ ద్రాక్షను మాత్రం చాలా మంది ఇష్టపడతారు. పుల్లగా,తీయగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే రుచితో పాటు అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ద్రాక్షలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బితో పాటు పొటాషియం, కాల్షియంలు తగిన మోతాదులో లభిస్తాయి.

ఫ్లెవనాయిడ్స్ కూడా ద్రాక్షలో ఎక్కువగా లభిస్తాయి. అంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ద్రాక్షలో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనం చేకూరుస్తాయి. అంతేకాదు ద్రాక్షలో తగిన మోతాదులో ఉండే కేలరీలు, ఫైబర్, గ్లూకోజ్, మెగ్నీషియం, సిట్రిక్ యాసిడ్ వంటి చాలా పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.
asthama
అస్తమాను తగ్గించే గుణం ద్రాక్షలో ఉంది. అస్తమాతో బాధపడేవారు ప్రతి రోజు కొన్ని ద్రాక్ష పళ్ళను తింటే క్రమేపి దాని తీవ్రత నుండి బయట పడవచ్చు. రక్తంలో నైట్రిక్ స్థాయిలను పెంచి రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని యాంటి ఆక్సిడెంట్స్ కొలస్ట్రాల్ అదుపులో ఉంచటానికి దోహదం చేస్తాయి.

ద్రాక్షను నేరుగా తిన్నా లేదా జ్యూస్ గా తీసుకున్న ఒకే పలితం ఉంటుంది. తీవ్రమైన మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు ఉదయాన్నే పరగడుపున నీరు,చక్కెర కలపకుండా ద్రాక్ష రసం త్రాగితే మంచి పలితాన్ని పొందవచ్చు. మైగ్రేన్ నొప్పి వచ్చిందంటే మందులు వాడుతూ ఇలా ద్రాక్షను తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ప్రతి రోజు కనీసం 10 నుంచి 15 ద్రాక్ష పళ్ళు తీసుకుంటే కంటి చూపును పరిరక్షించుకోవచ్చు. వయస్సు ప్రబావం కారణంగా కంటి చూపు మందగించడాన్ని తగ్గించే శక్తి ద్రాక్ష పళ్ళలో ఉంది. ఏదైనా లిమిట్ గా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.