ఈ ఆకును ఇలా వాడితే బ్లాక్ హెడ్స్, మొటిమలు మరియు నల్ల మచ్చలు అన్ని మాయం అవుతాయి

Guava Leaves Beauty Benefits : జామ పండును అందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే జామ ఆకులలో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు. ఈ ఆకులను ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. మన ఇంటిలో ఉండే మొక్కల ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నా…మనం పెద్దగా శ్రద్ద చూపము.
jama aaku
బ్లాక్ హెడ్స్ ని తగ్గించటానికి జామ ఆకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జామ ఆకులను శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసుకొని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. సమస్య తీవ్రంగా ఉంటే రోజులో రెండు సార్లు చేస్తే సరిపోతుంది.

మొటిమలు మరియు నల్లని మచ్చలును కూడా తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. జామ ఆకుల్లో విటమిన్ C సమృద్దిగా ఉంటుంది. ఈ విటమిన్ C మొటిమలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. జామ ఆకుల్లో యాంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన మొటిమలకు కారణమైన బాక్టీరియాను నియంత్రిస్తుంది.
Pimples,Beauty
జామ ఆకులను మెత్తని పేస్ట్ గా చేసి కొంచెం పసుపు కలిపి మొటిమలు మరియు నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు మరియు నల్ల మచ్చలు తొలగిపోతాయి. జామ ఆకులో యాంటి ఏజింగ్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
Young Look In Telugu
ఫ్రీ రాడికల్స్ వలన చర్మం దెబ్బతినకుండా జామ ఆకు సహాయపడుతుంది. చర్మాన్ని వృద్దాప్య చాయల నుండి రక్షించటం,చర్మ టోన్, నిర్మాణంను మెరుగుపరచటానికి, ఫ్రీ రాడికల్స్ ని నిర్మూలించటానికి జామ ఆకు సహాయపడుతుంది. అంతేకాక జామ ఆకు పేస్ట్ చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది. అలెర్జీలను జామ ఆకు తొందరగా నయం చేస్తుంది. జామ ఆకులో లో ఉండే హిస్టామిన్అనే మిశ్రమం అలెర్జీని వెంటనే నిరోదిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.