ఈ ఆకుతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది

Pudina Beauty Benefits In telugu : పుదీనాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనలో చాలా మందికి తెలుసు. పుదీనాతో పచ్చడి, పలావ్, ఫ్రైడ్ రైస్ వంటివి ఎన్నో రకాలు చేసుకుంటాం. పుదీనాలో ఎన్నో రకాల బ్యూటీ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు.
Health Benefits Of Eating Pudina
కాబట్టి పుదీనాతో ఉన్న బ్యూటీ ప్రయోజనాలు గురించి వివరంగా తెలుసుకుందాం. వర్షాకాలంలో పుదీనా చాలా ఎక్కువగా లభ్యమవుతుంది. పుదీనాను పొడి రూపంలో కూడా నిలవ చేసుకోవచ్చు. మొటిమల సమస్య అనేది ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తుంది. మొటిమలను వదిలించుకోవటానికి పుదీనా చాలా బాగా సహాయపడుతుంది.
lemon benefits
పుదీనా ఆకులను పేస్ట్ గా చేసి దానిలో నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గటమే కాకుండా ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే వృద్ధాప్య ఛాయలు కూడా ఆలస్యం అవుతాయి.
curd benefits in telugu
పుదీనా పేస్ట్ రక్తప్రసరణను మెరుగుపరిచి కంటి కింద వచ్చే నల్లటివలయాల్ని కూడా తగ్గిస్తుంది. పుదీనా ఆకుల పేస్టు లో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసి అరగంటయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో తేమ ఉంటుంది. మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. పుదీనా పేస్ట్ లో పసుపు కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా రోజు క్రమం తప్పకుండ చేస్తే చాలా తొందరగానే బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. పుదీనా పేస్ట్ లో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న మృత కణాలు, దుమ్ము,ధూళి అన్ని తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.