ముఖం మీద మచ్చలు ఉన్నా…ఎంత నలుపు ఉన్నా…బ్యూటీ పార్లర్ కి వెళ్లినంత గ్లో వస్తుంది

Face glowing tips with coconut oil : ఈ రోజుల్లో చాలామందికి ముఖం మీద నల్లని మచ్చలు, ఫిగ్మెంటేషన్, మొటిమలు వంటి అనేక రకాల కారణాలతో ముఖం కాంతివంతంగా లేకుండా నిష్టైజంగా ఉంటుంది. దాంతో బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు.

అయినా పెద్దగా ఫలితం కనబడక నిరాశకు గురి అవుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా ట్రై చేస్తే మంచి ఫలితం వస్తుంది. తక్కువ ఖర్చుతో మన ఇంటిలో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా ముఖాన్ని నల్లని మచ్చలు, మొటిమలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
cococnut Oil benefits in telugu
ఒక బౌల్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ లోని ఆయిల్, ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఒక నిమిషం సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. .
Young Look In Telugu
ఈ విధంగా వారంలో రెండు లేదా మూడుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు, సిగ్మెంటేషన్, నల్లని వలయాలు, మొటిమలు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు అన్ని తొలగిపోతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు. కొబ్బరి నూనె చర్మం మీద తేమ ఉండేలా చేస్తుంది.

విటమిన్ E చర్మానికి లోతుగా పోషణ అందిస్తుంది. నిమ్మరసంలో ఉండే లక్షణాలు చర్మం మీద మృతకణాలను తొలగించి ముఖం మెరవటానికి సహాయపడతాయి. ఇక పసుపును చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. మొటిమలకు కారణం అయినా బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.