Beauty Tips

కలబందలో ఇది కలిపి రాస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Super Fast Hair Growth Tips : ఈ మధ్య కాలంలో జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అయింది. జుట్టు రాలె సమస్య, చుండ్రు ఇలా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో తగ్గించుకోవచ్చు.

ఒక బౌల్ లో 1 స్పూన్ కొబ్బరి నూనె, 1 స్పూన్ ఆముదం , 1 స్పూన్ కలబంద జెల్ వేసి అన్ని ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి రెండు నిముషాలు మసాజ్ చేయాలి. రెండు గంటల తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
cococnut Oil benefits in telugu
ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టును తేమగా చేయడానికి సహాయపడతాయి. కొబ్బరి నూనెలో ఉండే లారిక్ ఆమ్లం జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది.
hair fall tips in telugu
ఆముదంలో ఉండే పోషకాలు జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా జుట్టు మృదువుగా కాంతివంతంగా ఉంటుంది. ఆముదం లోతైన కండీషనర్ గా పనిచేస్తుంది. ఆముదం చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు రాలకుండా బలంగా పెరిగేలా చేస్తుంది.
Hair Care
జుట్టు సంరక్షణలో కలబంద కీలకమైన పాత్రను పోషిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు నల్లగా మెరిసేలా చేస్తుంది. కలబంద కండీషనర్ లాగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.