Healthhealth tips in telugu

ప్రతి రోజు 5 ఆకులను నమిలి మింగితే మెదడు చురుగ్గా పనిచేసి మతిమరుపు సమస్యలు ఉండవు

Pudina Health benefits : ఈ మధ్యకాలంలో పుదీనా, కొత్తిమీర వంటి వాటిని ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అలాగే ఇంటిలో కుండీల్లో పెంచుకొని రెగ్యులర్ గా వాడుతూ వాటిలోని ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే పుదీనాలో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
Pudina Health benefits in telugu
ప్రతిరోజు ఐదు పుదీనా ఆకులను తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది పుదీనా వాసన కారణంగా తినటానికి ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ఈ ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పనిసరిగా తినటానికి ప్రయత్నం చేస్తారు. పుదీనాలో ఉండే స్పెషల్ వాసనను కాగ్నిటివ్ ఫంక్షన్ అంటారు.
Brain Foods
ఇది మెదడులో ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే శక్తి, అర్థం చేసుకునే శక్తి, విచక్షణ శక్తి వంటి వాటిని ఇంప్రూవ్ చేయడానికి సహాయ పడుతుంది. అలాగే బ్రెయిన్ ని బాగా యాక్టివేట్ చేయడానికి, చాలా షార్ప్ గా పని చేయడానికి పుదీనా చాలా బాగా సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది.విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. పుదీనా ఆకులలో బీటా కెరోటిన్ ఉంటుంది.

ఇది మన పొట్టలోకి వెళ్లాక విటమిన్ ఏ గా మారుతుంది. బీటా కేరోటిన్ అనేది ఒక పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఇక పుదీనాలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది మన ఆరోగ్యాన్ని మెరుగు పరచటానికి సహాయపడుతుంది.

ప్రతిరోజు తప్పనిసరిగా ఐదు పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని నమిలి మింగవచ్చు…లేదంటే పుదీనా ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు…లేదంటే వారంలో రెండుసార్లు పుదీనాను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. పుదీనా పచ్చడి చేసుకోవచ్చు లేదా మనం చేసుకునే కూరల్లో వేసుకోవచ్చు. పుదీనాను ఎలా తీసుకున్న పుదీనాలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.