యాలకులతో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది

cardamom beauty benefits : యాలకులను ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తాం. అలాగే యాలకులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో సమస్యల పరిష్కారానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే యాలకులలో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా వాడుతున్నారు. ఈ విషయం మనలో చాలా మందికి తెలియదు.

యాలకులలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన చర్మాన్ని శుద్ది చేసి నల్లని మచ్చలను తొలగించి చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ యాలకుల పొడి, ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
cardamom
మొటిమల కారణంగా వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తుంది. యాలకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. తేనె కూడా ఒక సహజ మాయిశ్చరైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. యాలకులలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా రక్త ప్రసరణను కూడా క్రమబద్ధీకరన చేసి చర్మం మెరిసేలా చేస్తుంది.
cardamom in telugu
యాలకులలో యాంటీసెప్టిక్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన అలెర్జీలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. నల్ల యాలకులు చర్మానికి హాని కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఒక నల్ల యాలకులను నమలడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది, తద్వారా స్పష్టమైన చర్మాన్ని అందిస్తుంది.
Young Look In Telugu
ఒక బౌల్ లో అరస్పూన్ ఒట్స్ పొడి, పావు స్పూన్ యాలకుల పొడి, సరిపడా రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు,మొటిమలు,ముడతలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.