ఈ టీ తాగితే వర్షాకాలంలో వచ్చే దగ్గు,జలుబు,తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం

Cold Home Remedies In Telugu : సీజన్ మారింది. ప్రస్తుతం మనలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఇవి ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం ఇస్తాయి. అన్ని మన వంటింటిలో ఉండేవే.
sonthi podi health benefits in telugu
చిన్న శొంఠి ముక్క, ఒక యాలక్కాయ, 5 మిరియాలను మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి ఒక స్పూన్ టీ పొడి, ఒక స్పూన్ పంచదార,అరస్పూన్ శొంఠి,మిరియాల పొడిని వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను పోసి మరో 5 నిమిషాలు మరిగించి గ్లాసు లోకి వడకట్టి తాగాలి.

ఈ విధంగా తాగితే ఈ సీజన్ లో వచ్చే దగ్గు,జలుబు,తలనొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. శొంఠికి ఆయుర్వేదంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిలో మెగ్నీషియం, ఫైబర్, సోడియం, ఇనుము, విటమిన్లు A మరియు C, జింక్, ఫోలేట్ ఆమ్లం, కొవ్వు ఆమ్లాలు, కాల్షియం సమృద్దిగా ఉంటాయి.

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మిరియాలలో ఉన్న లక్షణాలు కూడా దగ్గును తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ టీ తాగితే ఈ సీజన్ లో వచ్చే అన్నీ రకాల సమస్యలు తగ్గుతాయి. ఈ సీజన్ లో కీళ్ల నొప్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి కూడా మంచి ఉపశమనం కలుగుతుంది.
Masala Tea Benefits in Telugu
వండింట్లో ఉండే ఈ సహజ సిద్ధమైన పదార్థాలతో చాలా సులభంగా సీజనల్ గా వచ్చే ఇటువంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే మన ఆరోగ్యాన్ని చాలా సులభంగా కాపాడుకోవచ్చు. ఇలా ఇంటి చిట్కాలను పాటిస్తే దగ్గు,గొంతు నొప్పి,జలుబు,గొంతులో గరగర,ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.