ఈ 1 చిట్కా పాటిస్తే మీ కాలి పగుళ్లు శాశ్వతంగా మాయం అవుతాయి…ఇది నిజం

Home remedies for cracked heels in telugu : పాదాల పగుళ్ల సమస్యతో మనలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పాదాల పగుళ్లు రావటానికి శరీరంలో తేమ శాతం తగ్గటం, అలాగే విటమిన్లు, మినరల్స్ తక్కువగా ఉండటం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయడం, వయసు పైబడడం.. అధిక బరువు, సొరియాసిస్, ఎగ్జిమా, థైరాయిడ్, డయాబెటిస్ వంటివి కారణాలుగా చెప్పవచ్చు.
Feet Care Tips
పాదాల పగుళ్లను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. రాత్రి పడుకొనే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను మడమపై అప్లై చేసి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి సాక్స్‌ వేయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేయాలి.
cococnut Oil benefits in telugu
అలాగే కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి దానిలో పసుపు వేసి పాదాల పగుళ్లు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా పాదాల పగుళ్లు తగ్గుతాయి. పసుపు మార్కెట్ లో దొరికే పాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములను తెచ్చుకొని పొడి చేసుకుంటే మంచిది.
weight loss tips in telugu
వారానికి రెండు లేదా మూడు సార్లు, పాదాలను వేడి నీటిలో 10 నిమిషాలు ఉంచి, మడమను రాయితో రుద్దండి. ఇది మడమపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. ఆ తర్వాత గోరువెచ్చని కొబ్బరి నూనెను మడమ ప్రాంతంలో అప్లై చేయాలి. ఈ విధంగా రెగ్యులర్ గా చేస్తే పాదాల పగుళ్లు మాయం అవుతాయి.

ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే పాదాల పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ప్రతి రోజూ పాదాలకు కూడా ఫుట్ క్రీం లేదా మాయిశ్చరైజర్ వంటివి రాసుకోవాలి. లేదంటే కనీసం పెట్రోలియం జెల్లీ అప్లై చేసినా సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.