ప్రతి రోజు పసుపు వాడుతున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…వాడితే ఏమి అవుతుందో…?
Turmeric Side Effects : పసుపులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చాలా సమృద్దిగా ఉన్నాయి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పసుపు తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా పసుపు వాడకం కూడా చాలా ఎక్కువ అయింది.
పసుపును కొన్ని ఆయుర్వేద ఔషధాలలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. వంటలో కూడా ఉపయోగిస్తారు. పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. పసుపును ఎక్కువగా తీసుకుంటే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పసుపులో ఉన్న లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అలాగే కర్కుమిన్ స్థాయిలు కూడా తక్కువగానే ఉంటాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు వారి ఆహారంలో తీసుకోవచ్చు. అయితే ఔషధ రూపంలో మాత్రం తీసుకోకూడదు. అలా తీసుకుంటే గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు హాని కలుగుతుంది. కాలేయ సమస్యలు ఉన్నవారు పసుపుకు దూరంగా ఉండాలి.
కామెర్లు ఉన్నవారు పసుపును తీసుకుంటే హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెప్పుతున్నారు. పసుపు అధిక మోతాదులో తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల, ఐరన్ లోపం ఉన్నవారు పసుపును జాగ్రత్తగా వాడాలి. ఇది శరీరంలో మరింత ఐరన్ లోపానికి కారణమవుతుంది.
పసుపులో ఉండే కర్కుమిన్ అనే రసాయనం డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. అందువల్ల, డయాబెటీస్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు, ఎందుకంటే కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
పసుపు పిత్త స్రావాన్ని పెంచే సామర్థ్యం కలిగి ఉండుట వలన పిత్తాశయ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. పిత్తాశయంలో రాళ్లు లేదా పిత్త వాహిక సమస్యలు ఉన్న వారు పసుపుకు దూరంగా ఉండాలి. పసుపు రక్తం గడ్డకట్టడాన్ని నెమ్మదిస్తుంది. ఇది రక్తస్రావం సమస్యలతో బాధ పడుతున్న వారిలో గాయాలు మరియు రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.
శస్త్రచికిత్స సమయంలో మరియు శస్త్రచికిత్స తర్వాత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉన్నందున షెడ్యూల్ చేసిన శస్త్రచికిత్సకు రెండు వారాల ముందు పసుపు తినకూడదు. పసుపు రక్తం గడ్డకట్టడాన్ని ఆలస్యం చేస్తుంది. ఏది ఏమైనా పసుపును లిమిట్ గా తీసుకుంటే ప్రయోజనాలను పొందవచ్చు. పసుపును ఎక్కువగా తీసుకుంటేనే సమస్యలు వస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.