గుడ్డులో పచ్చసొనను పాడేస్తున్నారా…ఈ విషయం తెలిస్తే అసలు వదలకుండా తింటారు

Egg Yolk Benefits In telugu : Egg లో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల దృష్ట్యా మనలో చాలామంది గుడ్డు తినడం అలవాటు చేసుకున్నారు. గుడ్డులో పసుపు సొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని…మంచిది కాదని… కేవలం తెల్ల సొన మాత్రమే తింటూ ఉంటారు.

అయితే Egg పసుపు సొనలో కూడా ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. గుడ్డులోని తెల్లసొనలో విటమిన్ల పరిమాణం కంటే పచ్చసొనలో ఎక్కువ విటమిన్లు ఉంటాయి. గుడ్లలో ఏడు రకాల విటమిన్లు ఉంటాయి, వాటిలో విటమిన్లు A, K, E, D మాత్రమే పచ్చసొనలో ఉంటాయి.పచ్చ సొన లో ఉండే కొలెస్ట్రాల్ శరీరం కండరాలను నిర్మించడానికి ,శక్తిని ఉత్పత్తి చేయడానికి అవసరం.
Egg Benefits in telugu
అంతేకాక పచ్చసొనలో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. Egg మొత్తంలో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే…పచ్చసొనలోనే 2.6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. Egg పచ్చసొనలో 90 శాతం కాల్షియం, 93 శాతం ఐరన్ ఉంటాయి. తెల్లసొనతో పోలిస్తే, గుడ్డు పచ్చ సొనలో కూడా ఫోలేట్ మరియు విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.
Eat Egg Yellow
గుడ్డు పచ్చ సొనలో యాంటీఆక్సిడెంట్లు లుటిన్ మరియు జియాక్సంథైన్ ఉంటాయి, ఇవి వయస్సు సంబంధిత కంటి సమస్యలు లేకుండా కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. పచ్చసొనలో ట్రిప్టోఫాన్ మరియు టైరోసిన్ మరియు అమినో యాసిడ్‌లు కూడా ఉన్నాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. అధిక కొలెస్ట్రాల్ లేదా రక్తపోటు ఉన్న వారు రోజుకు ఎన్ని గుడ్లు తినవచ్చో డాక్టర్ ని సంప్రదించి…వారి సూచన ప్రకారం తినాలి.
Egg Benefits
గుడ్డు పచ్చసొన యొక్క పొరలో ఉండే సల్ఫేట్ గ్లైకోపెప్టైడ్‌లు మాక్రోఫేజ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి, ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఇన్‌ఫెక్షన్ల నుండి శరీరాన్ని కాపాడతాయి. గుడ్డు పచ్చసొనలో ఫాస్విటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, ఇది శరీరంలో మంటను కలిగించే సమ్మేళనాలను తగ్గించడంలో సహాయపడి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.