Beauty Tips

ఈ ఆకుకూరతో ఇలా చేస్తే చుండ్రు,దురదలు, ఇన్ ఫెక్షన్ వంటివి అన్ని మాయం అవుతాయి

Chundru Home Remedies In Telugu : జుట్టుకి సంబంధించిన సమస్యలను తగ్గించడానికి మెంతి ఆకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చుండ్రు సమస్య చాలా ఎక్కువగా కనబడుతుంది. చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకా నిరాశకు గురి అవుతూ ఉంటారు.

చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే తొందరగా తగ్గదు. చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. చుండ్రు తగ్గించుకోవడానికి వేల కొద్దీ డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కొంత మంది చుండ్రును తగ్గించుకోవటానికి ట్రీట్ మెంట్ కూడా తీసుకుంటూ ఉంటారు.
అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలోనే చాలా సులభంగా చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ కాలంలో మెంతికూర చాలా విరివిగా లభ్యమవుతుంది. మెంతి కూరను తీసుకుని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఒక బౌల్ లో నాలుగు స్పూన్ల మెంతికూర పేస్టు, ఒక స్పూన్ గోరింటాకు పొడి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ ఆముదం, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిసేలాగా కలపాలి.
curd benefits in telugu
ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు, తలలో దురద, ఇన్ ఫెక్షన్ వంటివి ఏమి లేకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకోవాలి.

ఈ రెమిడీ కోసం ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే అన్నీ సులువుగా అందుబాటులో ఉండేవే. చాలా తక్కువ ఖర్చులో ఇంటిలో ఉండే సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. తప్పకుండ ఈ చిట్కాను ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.