ఉల్లిపాయలో ఇది కలిపి జుట్టుకి రాస్తే జుట్టు రాలకుండా చాలా స్పీడ్ గా పెరుగుతుంది

Curry Leaves Hair Fall Tips : మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల నూనెలు, హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ఉపయోగించడం వల్ల వాటిలో కెమికల్స్ ఉండటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
Onion beaUTY tIPS
అలా కాకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో జుట్టు రాలే సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఈ సమస్య కోసం ఒక నూనె తయారు చేసుకోవాలి. ఈ నూనెను ఒక వారం రోజులు పాటు వాడితే మంచి ఫలితం కనబడుతుంది. దీనికోసం రెండు ఉల్లిపాయలు తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి.
curry leaves benefits
ఒక గిన్నెలో కొబ్బరి నూనె, ఆవనూనె సమానంగా తీసుకోవాలి…అంటే 50 గ్రాముల కొబ్బరినూనె తీసుకుంటే 50 గ్రాముల ఆవనూనె తీసుకోవాలి. ఆ తర్వాత ఉల్లి పేస్టు, గుప్పెడు కరివేపాకు ఆకులు వేయాలి. ఈ నూనెను డబల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాలి. ఆ తర్వాత నూనెను వడగట్టి సీసాలో నిలువ చేసుకోవచ్చు.
cococnut Oil benefits in telugu
ఈ నూనెను వారానికి రెండు లేదా మూడుసార్లు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అయ్యాక కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు పెరుగుదల బాగుంటుంది. జుట్టు మృదువుగా మారుతుంది. ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వలన జుట్టు రాలే సమస్యలు తగ్గించడంలో చాలా ఎఫెక్ట్ గా పని చేస్తుంది.
Mustared oil Benefits in telugu
కరివేపాకులో బీటా కరోటిన్ అధికంగా ఉండటం వలన జుట్టు కుదుళ్లు బలంగా ఉండేలా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు,కరివేపాకు మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కాస్త ఓపికగా ఈ నూనెను తయారుచేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.