గుడ్డును ఫ్రిజ్ లో పెట్టే ముందు ఒక్కసారి ఆగండి…ఈ నిజాన్ని తెలుసుకోండి

Egg Benefits : ఎగ్ లో ఎన్ని పోషకాలు ఉన్నాయో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలిసిన విషయమే. ఎగ్ లో మనిషికి అవసరమైన తొమ్మిది ప్రోటీన్లు ఉంటాయి. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తినవాల్సిన ఆహారాలలో ఎగ్ ఒకటి. ఎగ్ లో పొటాషియం,కాల్షియం, ఐరన్, మెగ్నిషియం, విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటాయి.
Egg
ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇన్ని పోషకాలు ఉన్న ఎగ్ ని చాలా మంది ఎక్కువగా తెచ్చుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయటం మంచిది కాదని పోషకార నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్లని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల లోపలి భాగం పాడైపోయి పై పెంకుపై బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది.
Eat Egg Yellow
దీంతో అవి ఉడికిన అంతగా రుచిగా ఉండవు.అలాగే అది మీ ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాద‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందుకే గుడ్ల‌ను ఫ్రిజ్‌లో పెట్ట‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. గుడ్లు సాధారణ వాతావరణంలో ఉన్నప్పుడే వాటిలోని పోషకాలు ముఖ్యంగా క్యాల్షియం, ప్రొటీన్ వంటివి ఉంటాయి.

వాటిని ఫ్రిజ్ లో పెట్టినప్పుడు పోతాయి. ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లను బయటకు తీశాక రెండు గంటలు తర్వాత మాత్రమే ఉపయోగించాలి. అది కూడా కేవలం వారం రోజులు మాత్రమే వాడాలి. గుడ్లని ఒక వారం కంటే ఎక్కువగా స్టోర్ చేయటం మంచిది కాదని నిపుణులు చెప్పుతున్నారు. రూమ్ టెంపరేచర్ వద్ద నిల్వ ఉంచిన కోడి గుడ్లను మాత్రమే తీసుకోవటం మంచిది.
Egg Benefits in telugu
Egg లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. రోజుకి ఒక Egg తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన సూచనలను పాటించి Egg తినటానికి ప్రయత్నం చేయండి. Egg ని ఏ రూపంలో తీసుకున్న వాటి ప్రయోజనాలను పొందవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.