బాదం నూనెలో ఇది కలిపి రాస్తే మచ్చలు లేని మెరిసే చర్మం మీ సొంతం

Almond Oil Benefits : ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. అయితే పెద్దగా ఖర్చు పెట్టకుండా ఇంటి చిట్కాలతో మచ్చలు లేని మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. అయితే కాస్త ఓపికగా ఫాలో అవ్వాలి.
Young Look In Telugu
చర్మ సమస్యలను తగ్గించడంలో బాదం నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాదం నూనెలో విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. అంతేకాక ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం నూనె చాలా సులువుగానే లభ్యం అవుతుంది.
Pimples,Beauty
మొటిమల సమస్య ఉన్నవారు ఈ చిట్కాను ఫాలో అవ్వండి. ఈ చిట్కా కోసం కేవలం 2 ఇంగ్రిడియంట్స్ సరిపోతాయి. ఒక స్పూన్ బాదం నూనెలో అర స్పూన్ తేనె కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా నాలుగు రోజులపాటు చేస్తే మొటిమలు అన్ని మాయమవుతాయి.

మరో ప్యాక్ గురించి కూడా తెలుసుకుందాం. 1 స్పూన్ బాదం నూనె అరస్పూను నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది.
milk
బాదం నూనెలో పాలు కలిపి ముఖానికి రాసి అరగంటయ్యాక నార్మల్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న నలుపు అంతా తొలగిపోతుంది. బాదం నూనె,పాలలో ఉన్న లక్షణాలు ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి. ఈ చిట్కాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మీరు ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.