ఈ సూప్ తీసుకుంటే ఊహించని ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా ఈ సీజన్ లో

Horse Gram Soup Benefits : ఉలవలను ఒకప్పుడు చాలా తక్కువగా ఉపయోగించేవారు. కానీ వాటిలో ఉన్న పోషకాలు చాలా అధికంగా ఉండటం వలన ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఉలవలతో సూప్, రసం, చారు, బిర్యానీ వంటి వాటిని తయారు చేసుకొని తింటున్నారు.

ఉలవలతో సూప్ తయారు చేసుకుని తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం. ముందుగా .ఉలవల సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు ఉలవలను శుభ్రంగా కడిగి నీటిని పోసి ఉడికించాలి. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని అర స్పూన్ నూనె వేసి వేడెక్కాక అర స్పూన్ వాము, ఒక స్పూన్ అల్లం తురుము వేసి వేగించాలి.
Horse Gram benefits
ఇవి వేగిన తర్వాత ఒక కప్పు ఉడికించిన ఉలవలను వేసి మూడు నిమిషాల పాటు మగ్గించాలి. ఆ తర్వాత ఒక కప్పు నీటిని పోయాలి అర స్పూన్ జీలకర్ర పొడి, పావు స్పూను మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టి మరిగించాలి. ఆ తర్వాత కొత్తిమీర. వేసి పొయ్యి మీద నుంచి దించేయాలి. అంతే ఉలవల సూప్ రెడీ.

ఈ సూపుని ముఖ్యంగా ఈ సీజన్లో అంటే వర్షాకాలంలో తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ సీజన్లో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది.కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
kidney problems
అలాగే కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తుంది. చలి కాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. ఉలవల్లో ఉండే పోషకాలు ఎదిగే పిల్లలకు ఒక టానిక్కులా పనిచేస్తాయి. ఉలువల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉలవలను వాడతారు. పైల్స్ చికిత్సలోనూ, కీళ్ల నొప్పులు తగ్గించడానికి ఉలవలు చాలా బాగా సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.