పొట్లకాయ తింటున్నారా…వాటిలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే…అసలు వదిలిపెట్టరు

Snake gourd Benefits In telugu : పొట్లకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పొట్లకాయలో విటమిన్ ఎ, బి, సి, మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం మరియు ఐరన్ సమృద్దిగా ఉన్నాయి. పొట్లకాయను కొంతమంది తినటానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇప్పుడు చెప్పే ప్రయోజనాలను తెలుసుకుంటే తప్పనిసరిగా తింటారు.

పొట్లకాయలో ఉండే మెగ్నీషియం రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి రక్తప్రవాహం బాగా సాగేలా చేసి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్,కడుపు ఉబ్బరం,మలబద్దకం వంటి సమస్యలు ఉన్నవారు ప్రతి రోజు ఉదయం ఒక స్పూన్ పొట్లకాయ రసాన్ని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే సరిపోతుంది.
Diabetes In Telugu
డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. పచ్చ కామెర్లతో బాధపడే వారు పొట్లకాయ రసాన్ని స్పూన్ మోతాదులో రోజుకి మూడు సార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. పొట్లకాయలో నీరు మరియు పీచు సమృద్దిగా ఉంటాయి.
Weight Loss tips in telugu
అందువల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. శరీరంలోని విష ప‌దార్థాల‌ను, వ్యర్దాలను బయటకు పంపి కిడ్నీల పనితీరు బాగుండేలా చేస్తుంది. కాల్షియం, విటమిన్ D సమృద్దిగా ఉండుట వలన ఎముకలకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. మన శరీరంలో కాల్షియం శోషణను ప్రోత్సహిస్తుంది.

జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు పొట్లకాయ రసాన్ని తల మీద బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే క్రమంగా చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు. ఈ సీజన్ లో విరివిగా దొరికే పొట్లకాయను తీసుకొని ఈ ప్రయోజనాలు పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.