బాలకృష్ణ అఖండలో అఘోర పాత్రకు మేకప్ వేసింది ఎవరో తెలుసా?

akhanda makeup artist vidhi : బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో వచ్చిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కరోనా సెకండ్ వేవ్ తర్వాత కలెక్షన్ల సునామి సృష్టించిన మూవీగా నిల్చింది. ఇందులో అఘోర పాత్రతో పాటు మురళీకృష్ణ అనే రైతు పాత్ర కూడా బాలయ్య చేసి మెప్పించాడు. ఇందులో అఘోర పాత్రలో బాలయ్య నటనకు జనం జేజేలు పలికారు.

బాలయ్య అభిమానులే కాదు, ఆడియన్స్ కి కూడా బాగా నచ్చేసిన అఘోర పాత్ర గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అయితే ఫిదా అవుతూ అచ్చం శివుడిని చూసినట్లు ఉందని చెప్పాడు. చిత్ర బృందం కూడా ఇలాగే ప్రశంసలు కురిపించింది. అయితే ఇంతగా ఆకట్టుకున్న ఈ పాత్రకు మేకప్ వేసింది మేకప్ మ్యాన్ ఎవరంటే ఒక ఉమెన్.

తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ సదరు మేకప్ ఉమెన్ గురించి మీడియాకు వెల్లడించాడు. పంజాబ్ కి చెందిన విధి ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి, బాలయ్యకు మేకప్ వేసి తన ఎదుట నిలబెట్టెదని చెప్పుకొచ్చాడు. మేకప్ కి గంటన్నర నుంచి రెండు గంటలు పట్టేదట.