సోంపు+పటికబెల్లం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

Fennel seeds and mishri benefits In Telugu : సోంపు,పటికబెల్లం రెండింటిలోను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ విడిగా కాకుండా కలిపి తింటే రెట్టింపు ప్రయోజనాలను పొందవచ్చు. సోంపులో కాల్షియం, సోడియం, ఐరన్ మరియు పొటాషియం,జింక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్దిగా ఉంటాయి.
fennel Seeds Benefits In telugu
ఇక పటికబెల్లం విషయానికి వస్తే B1, B2, B12, ఐరన్,కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ వంటివి సమృద్దిగా ఉంటాయి. చాలా మంది భోజనం అయ్యాక సోంపు,పటికబెల్లం కలిపి తీసుకుంటారు. ఇలా తీసుకోవటం వలన సోంపులో ఉండే ఫైబర్ తీసుకున్న ఆహారం ఎటువంటి సమస్యలు లేకుండా బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
Patika Bellam Cold And Cough
గ్యాస్ మరియు అసిడిటీ సమస్యలు ఉన్నవారు ఆహారం తిన్న తర్వాత సోంపు,పటికబెల్లం కలిపి తింటే చాలా ప్రయోజనం కలుగుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అరస్పూన్ సోంపు, చిన్న పటికబెల్లం ముక్కను కలిపి తింటే…రెండింటిలోను సమృద్దిగా ఉండే ఐరన్ రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.

కంటికి సంబందించిన సమస్యలను తగ్గించి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. నోటిలో ఉన్న చెడు బ్యాక్టీరియాను తొలగించి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. నోటి యొక్క pH స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారు సోంపు,పటికబెల్లం తీసుకుంటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
Immunity foods
అలసట,ఒత్తిడిగా ఉన్నప్పుడు సోంపు,పటికబెల్లం కలిపి తింటే ఒత్తిడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచి ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే దగ్గు,గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. భోజనం చేసిన వెంటనే వచ్చే బద్దకాన్ని తగ్గిస్తుంది. కాబట్టి సోంపు,పటికబెల్లం కలిపి తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.