సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్రను రిజెక్ట్ చేసిన ఐదుగురు స్టార్ హీరోయిన్లు..!

seethamma vakitlo sirimalle chettu movie : చాలాకాలం తర్వాత మల్టీస్టారర్ మూవీగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ అందుకుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో పెద్దోడు, చిన్నోడుగా విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించి, మెప్పించారు.

2013 జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజై , వరల్డ్ వైడ్ 54.75 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు, ఈ చిత్రానికి ఉత్తమ కుటుంబ చిత్రంగా నంది అవార్డు లభించింది. అలాగే ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకి, ఉత్తమ సహాయ నటుడుగా ప్రకాష్ రాజ్ కి, ప్రత్యేక జ్యూరీ అవార్డుగా అంజలి నంది అవార్డులు దక్కాయి. మాటల రచయిత గణేష్ పాత్రోకి ఇది చివరి చిత్రం.

ఈ మూవీలో కొన్ని కీలక అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా గీత పాత్రకి సమంతని తీసుకున్నారు. అంతవరకూ సింగర్ చిన్మయి డబ్బింగ్ చెప్పేది. అయితే ఈ మూవీ నుంచి సమంత సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం స్టార్ట్ చేసింది. ఇక సీత పాత్రకోసం త్రిష, స్నేహా, భూమిక, అనుష్కలను అనుకున్నా, చివరకు అమలపాల్ ఒకే చెప్పాక ఆమె ఎందుకో తప్పుకుంది.

దాంతో అంజలి ఒకే అయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలని డైరెక్టర్ శ్రీకాంత్ అనుకుంటే, చివరకు పవన్ ప్లేస్ లోకి వెంకీ ఒకే చెప్పాడు. అలాగే రేలంగి మావయ్య పాత్రకి హీరో రాజశేఖర్ ని అనుకుంటే, తర్వాత ప్రకాష్ రాజ్ ని ఫిక్స్ చేసారు. 9ఏళ్ళు అయినా ఇంకా అందరి మదిలో ఈ మూవీ ఉంది.