Healthhealth tips in telugu

మొలకెత్తిన శనగలు తింటే ఎన్నో ప్రయోజనాలు…ముఖ్యంగా ఆ సమస్యలు ఉన్నవారు…

Chickpeas sprouts benefits : శనగల్లో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే శనగలను మొలకలుగా తింటే మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. శనగలను శుభ్రంగా కడిగి గిన్నెలో పోసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయలి. మరుసటి రోజు ఉదయం శనగల్లో నీటిని తీసివేసి పలుచని క్లాత్ లో శనగలను వేసి మూట కట్టాలి.

మరుసటి రోజు ఉదయానికి మొలకలు రావటం ప్రారంభం అవుతాయి. సాయంత్రం అయ్యేసరికి మొలకలు పూర్తిగా వస్తాయి. ప్రతి రోజు ఒక స్పూన్ శనగల మొలకలను తీసుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రిజ్ లో పెడితే నాలుగు రోజుల పాటు నిల్వ ఉంటాయి. వీటిలో ప్రోటీన్,కార్బోహైడ్రేట్ సమృద్దిగా ఉంటుంది.
gas troble home remedies
అందువల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. మొలకెత్తిన శనగల్లో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన ప్రేగు కదలికలు బాగా జరిగేలా చేసి జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. వీటిని తీసుకోవటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు.
Weight Loss tips in telugu
అంతేకాకుండా గ్రెలిన్ అనే ఆకలి హార్మోన్ విడుదలను నిరోదించి…ఆకలి అనే భావన మెదడుకు చేరకుండా చేసి ఎక్కువ ఆహారం తీసుకోకుండా చేసి బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. వీటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన రక్త నాళాలు మరియు ధమనులలో హానికరమైన కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

అలాగే హృదయనాళ వ్యవస్థపై అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. పొటాషియం ఉండుట వలన రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ A సమృద్దిగా ఉండుట వలన కంటి కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది.

మొలకెత్తిన శనగల్లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఐరన్,కాపర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచటమే కాకుండా రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.