ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే చాలు రోగ నిరోధక శక్తి పెరగటమే కాకుండా శరీరంలో కొవ్వు కరిగిపోతుంది
Dry strawberry benefits in Telugu : స్ట్రాబెర్రీలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీని రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. స్ట్రాబెర్రీ తాజాగా తీసుకోవచ్చు…లేదంటే Dry strawberry రూపంలో కూడా తీసుకోవచ్చు. ఈ సీజన్ లో వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండాలంటే శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి ఎక్కువగా జరగాలి. యాంటీ బాడీస్ ఉత్పత్తికి అవసరమైన పోషకాలు స్ట్రాబెర్రీలలో సమృద్దిగా ఉంటాయి. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి,కెరోటి నాయిడ్స్,ఫ్లవనాయిడ్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.
అలాగే 6 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ బి సెల్స్ ని బూస్ట్ చేసి యాంటీ బాడీస్ ఉత్పత్తిని పెంచుతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకుంటే ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే నేచురల్ గా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. వారంలో మూడు సార్లు
strawberry లను తీసుకోవాలి.
అల్జీమర్స్, మతిమరపు వంటివి రాకుండా ఉండాలంటే స్ట్రాబెర్రీలను తప్పనిసరిగా తినాలి. వీటిలో ఉన్న పోషకాలు గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. స్ట్రాబెరీలో ఉండే పొటాషియం రక్త ప్రసరణను క్రమబద్దం చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. స్ట్రాబెరీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటోకెమికల్స్ కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. స్ట్రాబెరీలో ఎలాజిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంట్. ఇది ఎముకల బలానికి బాగా సహాయపడుతుంది. కాబట్టి అన్నీ కాలాల్లోనూ దొరికే Dry strawberry తీసుకొని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.