Healthhealth tips in telugu

బాదం పప్పును ఎక్కువగా తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Almonds Health Benefits in telugu : బాదం పప్పులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి సమయంలో బాదం పప్పును నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన బాదంపప్పు తొక్క తీసి తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు బాదం పప్పు ఎక్కువగా తినకూడదు.
Diabetes patients eat almonds In Telugu
రక్త పోటు సమస్యతో బాధపడుతూ మందులు వాడే వారు ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మాంగనీస్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు పెరగడానికి సహాయపడుతుంది. అలాగే విటమిన్-ఇ సమృద్ధిగా ఉండటం వలన మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు కూడా ఎక్కువగా తినకూడదు.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా బాదంపప్పుకు దూరంగా ఉంటేనే మంచిది.
kidney problems
ఎందుకంటే బాదంపప్పులో ఆక్సలేట్ ఉండటం వల్ల కిడ్నీ సమస్యలను పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారు కూడా బాదం పప్పు తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బాదం పప్పులో ఫైబర్ ఎక్కువగా ఉండుట వలన అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా బాదంపప్పుకు దూరంగా ఉండాలి.
Weight Loss tips in telugu
బాదం పప్పులో కేలరీలు అధికంగా ఉండటం వల్ల మరింత శరీర బరువును పెంచుతుంది. బాదంపప్పులో అలర్జీని కలిగించే అమాండిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల అలర్జీ సమస్య ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే బాదంపప్పును మోతాదుకు మించి ఎక్కువగా తీసుకుంటేనే ఇబ్బందులు వస్తాయి.

రోజుకి నాలుగు బాదం పప్పులు తింటే ఎటువంటి సమస్యలు రావు. ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు కూడా మోతాదు మించకుండా తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఏమైనా సమస్యలు ఉన్నప్పుడూ తప్పనిసరిగా ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించి బాదంపప్పు తింటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.