Healthhealth tips in telugu

వంట‌ల్లో `అజినోమోటో` వాడుతున్నారా…అయితే ఈ విషయాలు తెలుసా…అసలు నమ్మలేరు

Ajinomoto Side Effects in telugu : ఒకప్పుడు అజినోమోటోను ఎక్కువగా చైనీస్ వంటకాలలో వాడేవారు. కానీ ఇప్పుడు అన్నీ రకాల వంటలలోనూ వాడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్స్‌లో ఎక్కువగా అజినోమోటోను వాడేవారు. ఇప్పుడు మన వంటగదిలోకి కూడా వచ్చేసింది. దాంతో దీని వాడకం బాగా ఎక్కువైంది.
Ajinomoto
ఇది ఆహార పదార్థాలకు మరింత సువాసనాభరితంగా ఉండేట్లు మరియు దీనికి అలవాటు పడేలా చేస్తుంది. అయితే అజినోమోటోను ఎక్కువగా తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. తలనొప్పి చిన్నగా మొదలయ్యి అది తీవ్రంగా మారుతుంది. అలాగే అది మైగ్రైన్ తలనొప్పికి కూడా దారి తీస్తుంది.
saraswati Plant
నాడీ మండల వ్యవస్థ మీద ప్రభావం చూపి నరాలు మొద్దుబారడం, ముఖం,మెడ మీద మంట,నొప్పి, మత్తుగా ఉండటం,నరాల క్షీణత కారణంగా పార్కిన్‌సన్స్‌, అల్జీమర్స్‌ వంటి సమస్యలు వస్తాయి. గుండె పనితీరుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి గుండె కొట్టుకునే వేగాన్ని తగ్గించి గుండె పోటు మరియు గుండెకు సంబందించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

రక్తపోటు పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కంటికి సంబందించిన సమస్యలు కూడా ఎక్కువగానే వస్తాయి. అంతేకాక డయాబెటిస్ వచ్చే ముప్పు కూడా ఎక్కువగానే ఉంది. అధిక బరువు కూడా పెరిగే అవకాశం ఉంది. అజినోమోటో కలిగిన పదార్థాలను తినేవారికి నాలుకపై ఉండే రుచి గుళికలు మరింత ప్రభావితం అవుతాయి. అంటే ఆకలి ఎక్కువగా వేస్తుంది.
Weight Loss tips in telugu
దాంతో ఎక్కువగా తినాలి అని అనిపిస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారు. ఈ అజినోమోటోను ఎప్పుడైనా తీసుకుంటే ప‌ర్వాలేదు.కానీ, రెగ్యుల‌ర్‌గా తీసుకుంటే మాత్రం చిక్కుల్లో ప‌డాల్సి వ‌స్తుంది. కాబట్టి తినాలని అనిపించినప్పుడు అప్పుడప్పుడు తినండి. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచిది. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవు. కాబట్టి ఎటువంటి వాటికి కాస్త దూరంగా ఉంటేనే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.