Healthhealth tips in telugu

నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటున్నారా…ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవారు…

Black raisins benefits in telugu : మీరు ఎప్పుడైనా నల్ల ఎండు ద్రాక్షను తిన్నారా.. నల్ల ఎండు ద్రాక్షలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నల్ల ఎండు ద్రాక్ష రుచి కూడా చాలా బాగుంటుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఫైబర్, ప్రోటీన్, పిండి పదార్థాలు,కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి వంటివి సమృద్ధిగా ఉంటాయి.
black raisins
నల్ల ఎండు ద్రాక్షలో బోరాన్ సమృద్ధిగా ఉండుట వలన ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన ఎముకల సాంద్రతను పెంచి ఎముకలు బలంగా,ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ మధ్య కాలంలో రక్తహీనత సమస్య చాలా ఎక్కువగా కనపడుతుంది.
Top 10 iron rich foods iron deficiency In Telugu
దీనిలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య ఉన్నవారికి బాగా సహాయపడుతుంది. నల్ల ఎండుద్రాక్షలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన మలబద్దకం,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. పొటాషియం, ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

వీటిల్లో ఉండే పాలీఫెనాల్స్, ఫైబర్ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించి గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో ప్రతి రోజు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు.

నల్ల ఎండు ద్రాక్షలోని మొత్తం పోషకాలు మన శరీరం గ్రహించాలంటే…5 నల్ల ఎండు ద్రాక్షను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం నానిన నల్ల ఎండు ద్రాక్షను తింటూ ఆ నీటిని తాగాలి. ఉదయం సమయంలో తినటం కుదరని వారు ఉదయం సమయంలో నానబెట్టి సాయంత్రం సమయంలో కూడా తినవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.