Healthhealth tips in telugu

గర్భధారణ సమయంలో మొక్కజొన్న తింటే ఏమి జరుగుతుందో తెలుసా…అసలు నమ్మలేరు

Eating Corn During Pregnancy :సాధారణంగా గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ పొరపాటు చేసినా ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు గర్భదరణ సమయంలో సలహాలు ఇస్తూ ఉంటారు.

గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలు చాలా మేలు చేస్తాయి.వాటిల్లో మొక్కజొన్న ఒకటి. అయితే మనలో చాలామంది మొక్కజొన్న తింటే కడుపు నొప్పి వస్తుందని తినడం మానేస్తుంటారు. కానీ పోషకాహార నిపుణులు మొక్కజొన్న తింటే చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్య అనేది వస్తుంది.
mokkajonna
ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఐరన్, పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండే ఆహారాలు గర్భధారణ సమయంలో తింటే మంచిది. రక్తహీనత సమస్య అనేది ఉండదు. అంతేకాకుండా తగిన మోతాదులో మొక్కజొన్నను తీసుకుంటే మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. మొక్కజొన్నలో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.
Diabetes diet in telugu
అంతేకాకుండా గర్భధారణ సమయంలో ఒక్కోసారి డయాబెటిస్ కూడా వస్తుంది. అలా డయాబెటిస్ వచ్చే అవకాశాలను కూడా మొక్కజొన్న తగ్గిస్తుంది. మొక్కజొన్నలో లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి పుట్టబోయే బిడ్డ కంటి చూపును మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Immunity foods
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే గర్భధారణ సమయంలో జ్ఞాపకశక్తిని ప్రోత్సహిస్తుంది. మొక్కజొన్నలో ఉండే థయామిన్ కండరాలు మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది. గర్భదరణ సమయంలో మొక్క జొన్నను లిమిట్ గానే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.