Healthhealth tips in telugu

గోరువెచ్చటి నీటిలో ఇంగువ కలిపి తాగితే ఊహించని ప్రయోజనాలు…అసలు నమ్మలేరు

Hing or asafoetida water benefits in telugu : ప్రతి వంటింటిలోనూ పోపుల డబ్బాలో ఇంగువ తప్పనిసరిగా ఉంటుంది. ఇంగువ వేస్తే వంటలకు మంచి రుచి వాసన వస్తుంది. వంటలు చేసినప్పుడు పోపులో ఇంగువ వేస్తే ఆ రుచే వేరు. ఇంగువలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కిడ్నీలో పేరుకున్న మలినాలు, విషాలు బయటకి పోయేలా చేస్తుంది. దాంతో కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు భోజనం తర్వాత ఈ నీటిని తీసుకుంటే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి జీర్ణ సంబంధ సమస్యలు ఏమి ఉండవు.

ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి సహాయపడతాయి. ఈ చలి కాలంలో దగ్గు జలుబు అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి. ఈ నీటిని తాగడం వల్ల శ్వాసకోస సమస్యలు దూరం అయ్యి దగ్గు జలుబు వంటివి రావు.

దగ్గు,జలుబు ఉన్నవారు ఈ నీటిని తాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే ప్రణాళిక ఉన్నవారికి కూడా సహాయ పడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో కౌమారిన్ అనే కాంపౌండ్ ఉండుట వలన రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చేసి ఒక్కసారిగా రక్త ప్రవాహం పెరగడం, తగ్గడం లేకుండా చేస్తుంది.

డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. తలనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ నీటిని తీసుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. మలబద్దకం సమస్య ఉన్నవారు రాత్రి పడుకొనే ముందు ఇంగువ నీటిని తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.